Wednesday, February 9, 2011

బూతులెందుకు తిడతాం?


'నాకు తెలుగుభాషలో ( ఏ భాషలోనైనా పర్వాలేదు) నచ్చని ఒకే ఒక పదం బూతు..' అని ఎవరినైనా చెప్పమనండి చూద్దాం. ఎవరూ చెప్పలేరు. బూతులు మాట్లాడేవాళ్లను చూసి అసహ్యించుకోవచ్చు. మేనర్‌లెస్‌ అని విసుగ్గా తిట్టుకోవచ్చు. ఇలా మాట్లాడితే మర్యాదగా ఉంటుందా? అని కసురుకోవచ్చు. కాని ఆడ,మగ- పిల్లా,పీచు భేదం లేకుండా అందరూ ఎప్పుడో ఒకప్పుడు బూతులు (కొందరివి పెదాలు దాటి బయటకు వస్తాయి.. మరి కొందరివి మనసులోనే ఉండిపోతాయి) తిట్టకుండా ఉండరు. కొద్దిగా చదువుకున్నవాళ్లు ముద్దుగా ఇంగ్లిషులో నాలుగక్షరాల పదాలు తిట్టచ్చు.. తెలుగు మాత్రమే వచ్చినవాళ్లు పచ్చిగా తెలుగులో తిట్టచ్చు. ఎలా తిట్టినా బూతు బూతే. దానికి ఉన్న అర్థం, పరమార్థం ఒకటే.
బూతులు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి- ప్రేమ పెరిగి మితిమీరినప్పుడు.  రెండోది- విపరీతమైన కోపం ప్రబలినప్పుడు. మొదటిదానిలో సరసం ప్రధాన భావం కాబట్టి ప్రణయ కలహాలే ఉంటాయి. ఇక రెండోదానిలో అహం దెబ్బతిని.. మనసులో పేరుకున్న కసి బయటకు వచ్చి బూతుల లావా వెల్లువెత్తుతుంది. ఈ మ«ధ్యే బ్లాగ్‌ పెట్టి అవార్డు కొట్టిన సుర్రావర్జుల రాము మరో బ్లాగర్‌ మీద బూతులతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఆ బ్లాగర్‌- వెక్కిరింతకు బూతులు సమాధానమా? అవి వాపోతున్నాడు. విస్తుపోతున్నాడు కూడా. కోపం వచ్చినప్పుడు మనిషి అసలు సంస్కారం బయటకు వస్తుందంటారు.. ఇదొక కోణం. కోపం వచ్చినప్పుడు మనిషిని అంచనా వేయకూడదంటారు. ఇది మరొక కోణం. రాములాంటి వారు ఎందరో? కొద్దిగా కదిపి చూస్తే- బోల్డన్ని బూతులు బయటకు వస్తూ ఉంటాయి.

శరత్‌ అన్నయ్య నువ్వు పాత ధూంవా? కొత్త ధూంవా? అని ప్రశ్నించాడు. పాత, కొత్తలనేవి మన ధృక్కోణానికి ఉండే రెండు అంచులు. ఈ రెండు కాలానికి సాపేక్షంగా ఉంటాయి. అది అన్నయ్య.. సంగతి..

Tuesday, February 8, 2011

కొత్త ఊపు.. కొత్త రూపు..

ప్రపంచమంతా కొత్త గాలులు వీస్తున్నాయి..
బ్లాగు ప్రపంచంలో మళ్లీ సంచలనాలు చెలరేగుతున్నాయి..
'చిన మాయను పెద మాయ.. పెద మాయను పెను మాయ..
అది స్వాహా.. ఇది స్వాహా..'  అన్న పెద్ద మనిషి మాటలు నిజమవుతున్నాయి.
'అమ్మాయి సన్నగా..అరనవ్వే నవ్వగా.. మతి తప్పి' కంప్యూటర్లను వదలకుండా పరవశించిపోయిన పెద్ద మనుషులు ఇప్పుడు చిరాకులు పరాకులు ప్రదర్శిస్తున్నారు.
మగపురుషులు పురుగులని వాదించే పెద్దక్కయ్యలు ప్రమదావనంలో దూరిన చీమల్ని ఏరివేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.
లోకానికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడిన చందాన- ఓ జర్నలిస్టే బ్లాగరు- నమ్మకు నమ్మకు ఈ బ్లాగులను అని పాడుకుంటూ పరారైపోదామనుకుంటున్నాడు.
ఆల్టర్నేటివ్‌ లేని ఆల్టర్‌ఈగోలు అడ్డగోలు వాదనలు చేస్తూనే ఉన్నాయి..
ఇలాంటి కన్ఫ్యూజన్‌లో ధూమ్‌ రావాల్సిన అవసరం ఉందని బలంగా అనిపించింది..
అందుకే మళ్లీ ధూమ్‌ బ్లాగ్‌లోకంలోకి అడుగుపెడుతున్నాడు..

ఆహ్వానించండి.. ఆదరించండి..