Tuesday, February 8, 2011

కొత్త ఊపు.. కొత్త రూపు..

ప్రపంచమంతా కొత్త గాలులు వీస్తున్నాయి..
బ్లాగు ప్రపంచంలో మళ్లీ సంచలనాలు చెలరేగుతున్నాయి..
'చిన మాయను పెద మాయ.. పెద మాయను పెను మాయ..
అది స్వాహా.. ఇది స్వాహా..'  అన్న పెద్ద మనిషి మాటలు నిజమవుతున్నాయి.
'అమ్మాయి సన్నగా..అరనవ్వే నవ్వగా.. మతి తప్పి' కంప్యూటర్లను వదలకుండా పరవశించిపోయిన పెద్ద మనుషులు ఇప్పుడు చిరాకులు పరాకులు ప్రదర్శిస్తున్నారు.
మగపురుషులు పురుగులని వాదించే పెద్దక్కయ్యలు ప్రమదావనంలో దూరిన చీమల్ని ఏరివేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.
లోకానికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడిన చందాన- ఓ జర్నలిస్టే బ్లాగరు- నమ్మకు నమ్మకు ఈ బ్లాగులను అని పాడుకుంటూ పరారైపోదామనుకుంటున్నాడు.
ఆల్టర్నేటివ్‌ లేని ఆల్టర్‌ఈగోలు అడ్డగోలు వాదనలు చేస్తూనే ఉన్నాయి..
ఇలాంటి కన్ఫ్యూజన్‌లో ధూమ్‌ రావాల్సిన అవసరం ఉందని బలంగా అనిపించింది..
అందుకే మళ్లీ ధూమ్‌ బ్లాగ్‌లోకంలోకి అడుగుపెడుతున్నాడు..

ఆహ్వానించండి.. ఆదరించండి..

5 comments:

  1. @ పవన్
    పాత ధూం కాదు. కొత్త ధూం అట.

    ReplyDelete
  2. పాత ధూం కొత్తగా వస్తున్నాడా లేక ఈ ధూం వేరేనా?

    ReplyDelete
  3. నీకు కొత్త దానా దొరికింది కుమ్ముకో: http://radicalfeminism.stalin-mao.in/post-modern

    ReplyDelete